స్టార్ కపుల్స్ దీపికా పదుకొనె రణ్ వీర్ సింగ్ మరోసారి తమ ఫ్యాషన్ టేస్ట్ చూపించారు. అమీర్ ఖాన్ లేటెస్ట్ సినిమా 'లాల్ సింగ్ చడ్డా' గురువారం ప్రేక్షకుల ముందుకొ చ్చింది. మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే గురువారం రాత్రి ముంబైలో జరిగిన ఈ సినిమా ప్రీమియర్ షోకు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. జంటగా వచ్చిన దీపికా-రణ్ వీర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇద్దరు కలర్ ఫుల్ సూట్ లో కనిపించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.