48 ఏళ్ల మలైకా అరోరా 37 ఏళ్ల అర్జున్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోతున్న విషయం తెలిసిందే. మొదట్లో రహస్యంగా కలిసే... ఈ జంట ఆ తర్వాత ఓపెన్ అయిపో యింది. విదేశీ టూర్ లు .. లోకల్ గా షికారు చేస్తూ హ్యాపీగానే గడుపుతున్నారు. అయితే ఈ జంట ఈ ఏడాది పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారనే ప్రచారం జరిగింది. సిస్టర్ సోనమ్ కపూర్ తో కలిసి కాఫీ విత్ కరణ్' షోకి హాజరైన అర్జున్ కపూర్.. మలైకాతో పెళ్లిపై స్పందించారు. పెళ్లి చేసుకునేందుకు తానిప్పుడే సిద్ధంగా లేనని బాబ్ పేట్టాడు. కొవిడ్ లాక్ డౌన్ కారణంగా రెండేళ్లు సినిమాలు లేక ఖాళీగా ఉన్నా... ఇప్పుడు కెరీర్ పై ఫోకస్ పెట్టాల్సిన టైమ్ అంటూ చెప్పుకొచ్చారు.