కమర్షియల్ చిత్రాలకు చక్కటి సందేశాన్ని జోడించి భారీ హిట్లు కొట్టే దర్శకుడు శంకర్. ఆయన కుమార్తె అదితీ శంకర్ ఇటీవల కార్తీ హీరోగా రూపొందిన విరుమాన్ చిత్రంలో హీరోయిన్‌గా వెండి తెరకు పరిచయమయ్యారు. ఇక రెండవ చిత్రం శింబు సరసన ఓకే చెప్పగా, తండ్రి శంకర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. గతంలో శింబుకు లవ్ వ్యవహారాలుండడమే తండ్రిగా అదితికి శంకర్ జాగ్రత్తలు చెప్పారని తెలుస్తోంది.