ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని, ఆరోజున "ఇంద్ర" సినిమాను రీ రిలీజ్ చెయ్యమని మెగా అభిమానులు ఇంద్ర మేకర్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ అభిమానులు ట్విట్టర్ లో వైజయంతి మూవీస్ సంస్థను రిక్వెస్ట్ చేస్తూ, ట్వీట్లు పెడుతున్నారు.
అందుకు వైజయంతి సంస్థ కూడా సానుకూలంగా స్పందించింది. ఇంద్ర సినిమాను 4కే వెర్షన్ లో తప్పకుండా రిలీజ్ చేస్తామని, ఐతే, అందుకు తగినంత సమయం కావాలని, మెగాస్టార్ పుట్టినరోజుకు ఈ సినిమాను రీ రిలీజ్ చేసే పరిస్థితిలో లేమని ఫ్యాన్స్ కు వివరించింది.
బి. గోపాల్ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి, ఆర్తి అగర్వాల్, సోనాలి బెంద్రే, ముఖేష్ ఋషి, సునీల్, sp బాలసుబ్రహ్మణ్యం కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూలై 24, 2002 న విడుదలై ఘనవిజయం సాధించింది.