శనివారం విడుదలైన నిఖిల్ సిద్దార్ధ్ "కార్తికేయ 2" తొలి షోతోనే హిట్ టాక్ సొంతం చేసుకుని, ఫుల్ హౌస్ ఫుల్ షోలతో థియేటర్లలో రన్ అవుతుంది. చందు మొండేటి డైరెక్షన్లో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. మొదటి రెండు రోజులు సాలిడ్ కలెక్షన్లను రాబట్టిన ఈ మూవీ మూడోరోజులో బ్రేక్ ఈవెన్ ను రీచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కార్తికేయ2 మూవీ టీం వరస సక్సెస్ పార్టీలను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా కార్తికేయ 2 మూవీ టీం ఈ రోజు హైదరాబాద్ లోని పలు ప్రముఖ థియేటర్లకు స్పెషల్ విజిటింగ్ చెయ్యనుంది. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు రాజధాని, దేవి 70MM, లక్ష్మి కళ, మల్లిఖార్జున థియేటర్లకు కార్తికేయ మూవీ టీం స్పెషల్ సర్ప్రైజింగ్ విజిటింగ్ చెయ్యనుంది.
![]() |
![]() |