కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తెలుగులో తొలిసారిగా నటిస్తున్న చిత్రం "ప్రిన్స్". టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కే వి అనుదీప్ డైరెక్షన్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఉక్రేనియన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ ఒకటవ తేదీన ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ కాబోతుంది. పోతే, ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు.
సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, శాంతి టాకీస్ సంయుక్త బ్యానర్ లపై డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, పుస్కర్ రామ్ మోహన రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా శివకార్తికేయన్ కు కెరీర్ లో 20 వ సినిమా. వినాయక చవితికి విడుదల కావాల్సిన ఈ సినిమా దీపావళికి వాయిదా పడిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa