ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి వాయిదా పడిన సత్యదేవ్ "గుర్తుందా శీతాకాలం"

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 30, 2022, 06:45 PM

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నాజంటగా నటించిన "గుర్తుందా శీతాకాలం" మూవీ మరోసారి వాయిదా పడింది. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. లేటెస్ట్ గా ఈ రిలీజ్ డేట్ కాస్తా సెప్టెంబర్ 23వ తేదికి వాయిదా పడిందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వేదాక్షర మూవీస్ సంయుక్త బ్యానర్లపై భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు. నాగశేఖర్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమాలో మేఘా ఆకాష్, కావ్యాశెట్టి, సుహాసిని మణిరత్నం కీలకపాత్రల్లో నటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa