మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పా'లి అనే సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 16, 2022న థియేటర్లలో విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ప్రముఖ టెలివిజన్ ఛానెల్ స్టార్ మా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి మూవీ మేకర్స్ కానీ, ఛానెల్ కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన బబ్లీ బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి బెంచ్‌మార్క్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa