యంగ్ హీరో శర్వానంద్ నుండి రాబోతున్న కొత్త చిత్రం 'ఒకేఒక జీవితం'. ఇందులో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాన్నాళ్ల తరవాత ఈ సినిమాతోనే అక్కినేని అమల ప్రేక్షకులను పలకరించనున్నారు.
సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ ఏడవ తారీఖున హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ హాల్ లో జరగబోతుంది. ఆ రోజు సాయంత్రం ఆరింటి నుండి ఈ ఈవెంట్ ప్రారంభం కానుందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. మరి, ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ ఎవరన్నది మేకర్స్ ఇంకా రివీల్ చెయ్యలేదు.
శ్రీ కార్తీక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు జెక్స్ బిజోయ్ సంగీతం అందించారు. డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకంపై ప్రకాష్ బాబు, ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోతే, తమిళంలో 'కణం' పేరుతో ఈ చిత్రం విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa