ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐదుగురు ప్రముఖుల వాయిస్ ఓవర్ తో PS 1 ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 09:40 AM

పొన్నియిన్ సెల్వన్ మ్యూజిక్ ఆల్బం మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నెహ్రు స్టేడియంలో ఈ రోజు సాయంత్రం జరగబోతుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. లేటెస్ట్ గా మేకర్స్ ఈ ఈవెంట్ కు సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే, పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కు ఐదుగురు విలక్షణ ప్రముఖులు గొంతు అరువిచ్చారట. తమిళంలో కమల్ హాసన్, తెలుగులో రానా, హిందీలో అనిల్ కపూర్, మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్, కన్నడలో జయంత్ కైకిని PS 1 ట్రైలర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారు.
మణిరత్నం డైరెక్షన్లో పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, కార్తీ, త్రిష, జయం రవి తదితరులు కీలకపాత్రలు పోషించారు. పోతే, ఈ చిత్రం సెప్టెంబర్ 30వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa