బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కు 50 వేలనుంచి రెమ్యునరేషన్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. వీరిలో జబర్దస్త్ తో ఫెమస్ ఆయిన ఫైమాకు వారానికి రూ.50వేలు ఇవ్వనున్నారట.అలాగే ఆరోహీ రావు(అంజలి), ఇనయా సుల్తానా లక్ష రూపాయల పారితోషకం అందుకుంటున్నారట. అదేవిధంగా క రాజశేఖర్, అభినయశ్రీ, సుదీప..రూ. 1.50 లక్షలు తీసుకోనున్నారట. ఇక గలాటా గీతూ వారానికి రూ.1,75,000 , వాసంతి కృష్ణన్, సాల్మన్ , శ్రీ సత్య, ఆదిరెడ్డిలు వారానికి రూ.2లక్షల రెమ్యునరేషన్ అందుకుంటున్నారని టాక్.మెరీనా వారానికి రూ.2.50 లక్షలు, హీరో బాల ఆదిత్య, ఆర్ జె సూర్య వారానికి రూ.3 లక్షల పారితోషికం అందుకుంటున్నారట. రోహిత్ వారానికి రూ.3.25 లక్షలు, శ్రీహాన్ రూ.3.50 లక్షలు, చలాకి చంటి, రేవంత్ రూ.4 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక చలాకీ చంటి, సింగర్ రేవంత్ అందరికంటే ఎక్కువగా అంటే 4 లక్షల వరకు రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో రచ్చ మొదలైంది. గలాటా గీతూ గొంతు ఎక్కువగా వినిపిస్తోంది. మరి మొదటి వారంలో ఎవరు హౌస్ నుంచి వచేస్తారో చూడాలి.