రవ్వలడ్డులాంటి పిల్ల అనిపించుకున్న నిన్నటి తరం హీరోయిన్ మాలాశ్రీ. ఆమె తెలుగు తెరపైన ఒక వెలుగు వెలిగింది. 'ప్రేమఖైదీ' .. 'బావ బావమరిది' 'ఊర్మిళ' వంటి చిత్రాలు ఆమెకి భారీ విజయాలను అందించి మంచి పేరుని తెచ్చిపెట్టాయి..ఆ తరువాత ఆమె కన్నడ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయింది. అందువలన తెలుగు చిత్రాలకి దూరమైంది. తన కూతురు రాధనా రామ్ ను హీరోయిన్ ను చేసే ఆలోచనలో ఉన్నట్టుగా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా మాలాశ్రీ చెప్పింది. ఇప్పుడు ఆమె కూతురు రాధనా రామ్ కన్నడలో దర్శన్ సరసన హీరోయిన్ గా ఒక భారీ సినిమాను చేస్తోంది.
దీనిని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు తెరకి కూడా రాధనాను పరిచయం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అది కూడా నాగచైతన్య జోడీగా. నాగచైతన్య హీరోగా పరశురామ్ ఒక చిత్రం చేయనున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. దాదాపు రాధనా రామ్ ఎంపిక ఖరారైనట్టు చెబుతున్నారు. ఈ విషయంపై ఇప్పటి వరకు ఇటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.