ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హ‌వా ట్రైల‌ర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 05, 2018, 11:12 AM

చైతన్య మాదాడి, దివి ప్రసన్న జంటగా నటించిన చిత్రం హవా. ఫిల్మ్‌ అండ్‌ రీల్‌ సంస్థ నిర్మాణంలో దర్శకుడు మహేష్‌ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. క్రైమ్‌, సస్పెన్స్‌, కామెడీ థ్రిల్లర్‌ కథతో ఈ సినిమా తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న హవా చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు టాలీవుడ్‌ దర్శకులు, ప్రముఖులు పాల్గొన్నారు. దర్శకుడు శేఖర్‌ కమ్ముల చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం దర్శకురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ….కొత్త దర్శకులు సరికొత్త ఆలోచనలతో, కథలతో సినిమాలు చేస్తున్నారు.


వీళ్ల వల్ల మాలాంటి దర్శకులం ఇంకాస్త జాగ్రత్త పడాల్సివస్తోంది. క్రైమ్‌ కామెడీ చిత్రాలంటే నాకిష్టం. ఈ సినిమా ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను. అన్నారు. దర్శక నిర్మాత మధురా శ్రీధర్‌ మాట్లాడుతూ…ఈ సినిమా చూడమని నన్ను చిత్ర బృందం అడిగారు. చూశాక కొత్త ప్రయత్నం అనిపించింది. అందుకే నా వంతు సహకారం అందిస్తున్నాను. హిందీ శాటిలైట్‌ హక్కులు అమ్ముడయ్యాయి. మంచి సినిమాగా పేరు తెచ్చుకుంటుందని నా నమ్మకం. అన్నారు. దర్శకుడు మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ….తొమ్మిది గంటల్లో తొమ్మిది నేరాలు ఎలా జరిగాయి అనేది ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా చూపిస్తున్నాం. తొమ్మిది మంది మేథస్సు ఈ నేరాలకు ఉపయోగపడిందన్నది కొత్త అంశం. ఆస్ట్రేలియాలో ఇప్పటిదాకా ఎవరూ షూటింగ్‌ చేయలని ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. చిత్ర పరిశ్రమలోని ఇంతమంది పెద్దలు మా చిత్రానికి సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. అన్నారు.


ఈ కార్యక్రమంలో రచయిత బీవీఎస్‌ రవి, దర్శకుడు వేణు ఊడుగుల, నిర్మాత రాజ్‌ కందుకూరి, కొరియోగ్రాఫర్‌ జానీ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa