ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కల్కి' లో ఛాన్స్ కొట్టేసిన పూరి హీరోయిన్

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 05, 2018, 11:50 AM

హార్ట్ ఎటాక్' మూవీ తో కుర్రకారు గుండెల్లో హార్ట్ ఎటాక్ తెప్పించిన హీరోయిన్ అదాశర్మ. పూరి జగన్నాధ్ పరిచయం చేసిన ఈ అమ్మడు మొదటి సినిమాతో చక్కని నటి అన్న పేరు తెచ్చుకుంది. అందానికి అందం.. అభినయం .. డ్యాన్సింగ్ ట్యాలెంట్ ఉన్నా ఎందుకనో ఈ అమ్మడికి ఆశించినన్ని అవకాశాలు అయితే రాలేదు. ఆ తర్వాత చేసిన మూవీస్ పెద్దవే అయిన ఈ బ్యూటీ కి మాత్రం అంతగా పేరు రాలేదు. ఎలా అయిన హిట్ ని తన ఖాతాలో వేసుకోవడం కోసం అదా చేయని ప్రయత్నం లేదు. ఓవైపు బాలీవుడ్ - మరోవైపు టాలీవుడ్ - కోలీవుడ్ ఇలా అన్ని పరిశ్రమల్లో తనవంతు ప్రయత్నాలు చేసింది. కానీ ఆశించినంత పెద్ద ఆఫర్ ఒక్కటీ లేదు. ఆ క్రమంలోనే `అదా కి అదా` పేరుతో ట్విట్టర్ లో - ఇన్ స్టాలో బోలెడంత హంగామా క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియా క్వీన్ గా నిరంతర ఫోటోషూట్లతో వేడెక్కిస్తూ యూత్కి టచ్ లో ఉంది. అయినా టాలీవుడ్ లో మాత్రం మరో అవకాశం దక్కించుకోలేకపోయింది.


           కాని ఇప్పుడు అదా కి ఒక మంచి ఛాన్స్ వెతుక్కొంటూ వచ్చింది.రాజశేఖర్ హీరో గా, ప్రశాంత వర్మ డైరెక్ట్ చేస్తున్న 'కల్కి' చిత్రంలో ఛాన్స్ ని దక్కించుకొంది.ఈ ఛాన్స్ దక్కినందుకు అదా చాలానే ఉబ్బితబ్బిబ్బవుతోంది.ఈ విషయం గురుంచి చెప్తూ ఇన్స్టా ,ట్విట్టర్ లో తన లేటెస్ట్ ఫోటోని షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చింది." తెలుగులో హార్ట్ ఎటాక్ ,సన్నాఫ్ సత్యమూర్తి ,క్షణం వంటి సినిమాలో నావి అన్ని విభిన్నమయిన పాత్రలు, ఇప్పుడు కల్కి మూవీ లో కుడా అలంటి డిఫెరెంట్ రోల్ నే చేయబోతున్నాను. ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో చేయడం నాకు చాలా ఆనందం గా ఉంది" అంటూ ట్వీట్ ని ముగించింది. మూవీ లో ఛాన్స్ వస్తేనే ఇంత ఆనందపడితే సినిమా హిట్ అయితే ఇంకే రేంజ్ లో ఆనందపడుతుందో...






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa