రంజిత్, సౌమ్య మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం "లెహరాయి". ఈ సినిమాతో రామకృష్ణ పరమహంస టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బెక్కం వేణుగోపాల్ సమర్పణలో, మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఘంటాడి కృష్ణ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. రేపు ఉదయం పదకొండింటికి లెహరాయి టీజర్ రిలీజ్ కాబోతుందని అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa