సినిమా రివ్యూలు తాను కూడా చూస్తానని హీరో నాగార్జున తెలిపారు. సినిమాలకు మంచి టాక్ వచ్చే విషయంలో రివ్యూలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. తాను కూడా రివ్యూలు చూశాకే మూవీస్, వెబ్ సిరీస్‌లు చూస్తానని చెప్పారు. ముందు ఐఎండీబీ రేటింగ్స్ చూసి, కనీసం 1000 రివ్యూలు, 7 రేటింగ్ ఉంటే అప్పుడు ఆ సినిమా చూస్తానని చెప్పారు. సోషల్ మీడియా వల్ల రివ్యూలకు డిమాండ్ పెరిగిందన్నారు.