కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన కొత్త చిత్రం "నేనే వస్తున్నా". తమిళంలో "నానే వరువేన్" అనే టైటిల్ తో తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులో నేనే వస్తున్నా గా విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషలలో రేపే ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. తెలుగు లో పరిస్థితి పక్కన పెడితే, తమిళ నాట ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా మెప్పించడమే ఇందుకు కారణం.
ధనుష్ బ్రదర్ సెల్వ రాఘవన్ ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ తను ఈ సినిమాను నిర్మించగా, తెలుగు హక్కులను ప్రఖ్యాత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కొనుగోలు చేసింది.
ఈ సినిమాలో ధనుష్ సరసన ఎల్లీ అవ్రామ్, ఇందూజ రవిచంద్రన్ నటిస్తున్నారు. ఇటీవలే తిరుచిత్రంబలం సినిమాతో తమిళ నాట సూపర్ హిట్ అందుకున్న ధనుష్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చెయ్యాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.