బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ డూప్ సాగర్ పాండే గుండెపోటుతో మరణించారు. ముంబైలో జిమ్ చేస్తుండగా ఆయనకు గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. సాగర్ పాండే ఆత్మకు శాంతి కలగాలని కోరారు. సాగర్ సల్మాన్‌తో బజరంగీ భాయిజాన్, ట్యూబ్‌లైట్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, దబాంగ్, దబాంగ్ 2 చిత్రాల్లో నటించాడు.