బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం "స్వాతిముత్యం". ఈ సినిమాతోనే గణేష్ సినీరంగ ప్రవేశం చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ రేపు సాయంత్రం హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎరేంజ్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా టాలీవుడ్ 'జాతిరత్నం', ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నవీన్ పోలిశెట్టి హాజరు కాబోతున్నారు.
లక్ష్మణ్ కే కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa