ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ రోజు మధ్యాహ్నం విడుదల కాబోతున్న 'గాడ్ ఫాదర్' హిందీ ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 01, 2022, 01:32 PM

తెలుగులో విడుదలైన గాడ్ ఫాదర్ ట్రైలర్ కు ప్రేక్షకులు ఎలాంటి విశేష స్పందనను కనబరిచారో అందరికి తెలిసిన విషయమే. లేటెస్ట్ గా గాడ్ ఫాదర్ ట్రైలర్ హిందీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 03:06 నిమిషాలకు గాడ్ ఫాదర్ హిందీ ట్రైలర్ విడుదల కాబోతుంది. ఈ మేరకు ముంబైలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.


బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ సినిమాలో కీలక అతిథి పాత్రలో నటించారు. దీంతో హిందీలో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.


అక్టోబర్ ఐదవ తేదీన తెలుగు, హిందీ, మలయాళ భాషలలో విడుదల కాబోతున్న ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార, సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాధ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకుడు కాగా తమన్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa