ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కంగనా రనౌత్ - విక్రమ్ కాంబోలో మూవీ రాబోతోందా..??

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 04, 2022, 05:29 PM

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నుండి త్వరలోనే "సీత" అనే మైథలాజికల్ మూవీ రాబోతుంది. అలౌకిక్ దేశాయ్ ఈ సినిమాకు డైరెక్టర్ కాగా, ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి KV విజయేంద్ర ప్రసాద్ గారు రచయితగా పని చేస్తున్నారు.



ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీపై ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, సీత పాయింట్ ఆఫ్ వ్యూలో రామాయణం ఎలా ఉంటుంది? అనే కధాంశంతో తెరకెక్కబోతున్న ఈ మూవీలో కోలీవుడ్ హీరో విక్రమ్ శ్రీరాముడిగా నటించబోతున్నట్టు టాక్. ఈ మేరకు డైరెక్టర్ విక్రమ్ ను కలిసి, స్టోరీ కూడా నరేట్ చేశారట. విక్రమ్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలున్నట్టు కూడా తెలుస్తుంది. మరి, ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఆగాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa