ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్ స్టాపబుల్ : ఫన్నీ, సీరియస్, కాంట్రవర్సీ టాపిక్స్ తో బాల చంద్రుల ఎపిసోడ్ ప్రోమో

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 11, 2022, 06:20 PM

కొంచెంసేపటి క్రితమే అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇరు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ఎదురుచూపులకు అన్ స్టాపబుల్ మేకర్స్ ఈ ప్రోమోతో స్వస్తి పలకడమే కాక, సెకండ్ సీజన్ మరింత క్రేజీగా ఉండబోతుందని హామీ ఇచ్చేసారు.


బాలయ్య హోస్ట్ చేసే ఈ టాక్ షోకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ ఇద్దరు బాలచంద్రులు కలిసి ఎన్నో విషయాలపై చర్చించినట్టు తెలుస్తుంది. మరీ సీరియస్ గా కాకుండా, మరీ కాంట్రవర్షియల్ కాకుండా, ఎక్కువశాతం ఫన్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ ప్రోమో సెకండ్ సీజన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నమోదు చేసింది. పోతే, అక్టోబర్ 14 న ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa