ట్రెండింగ్
Epaper    English    தமிழ்

NKR 19 : కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం ...??

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 12, 2022, 04:35 PM

మైత్రి మూవీస్ సంస్థలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉందని వివరిస్తూ ఇటీవలే మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు.


తాజాగా ఈ సినిమాపై ఒక ఇంటరెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటంటే, ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నారట. మూడు విభిన్న పాత్రలలో కళ్యాణ్ రామ్ నటన అద్భుతంగా ఉంటుందట. రాజేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు కాగా, మిగిలిన విషయాల గురించి తెలియాల్సి ఉంది.


బింబిసార సినిమాలో ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకుల విశేష ఆదరణకు నోచుకున్న కళ్యాణ్ రామ్ మరి, త్రిపాత్రాభినయంతో ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa