సూపర్ స్టార్ మహేష్ బాబు హాలీవుడ్ లెవెల్ స్టైలిష్ హ్యాండ్సమ్ హీరో. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరి మహేష్ నిజంగానే హాలీవుడ్ హీరోలా మారిపోతే,.... ఎలా ఉంటుంది... ? అద్దిరిపోదూ...
తాజాగా అదే జరిగింది. మహేష్ తన హెయిర్ ను అల్ట్రా ఫ్యాషన్ ప్రో స్టైల్ లో మార్చేసి, అద్దంలో చూసుకుంటున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. SSMB 28 లో మహేష్ లుక్ ఇదే అని తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. మహేష్ ను చూసిన నెటిజన్లు, అభిమానులు సూపర్ స్టార్ మ్యానియా తో ఊగిపోతున్నారు.