ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతదేశపు మొట్టమొదటి క్రియేచర్ కామెడీ "భేడియా"... ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 19, 2022, 03:37 PM

బాలీవుడ్ మూవీ "భేడియా" కి సంబంధించిన హిందీ, తెలుగు, తమిళ ట్రైలర్ లు కొంచెంసేపటి క్రితమే విడుదలయ్యాయి. వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు అమర్ కౌశిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.


భారతదేశపు తొలి క్రియేచర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఫన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. ఒక మనిషిని తోడేలు కరిస్తే, ఆ మనిషిలో కలిగే ఆశ్చర్యకరమైన మార్పులు ఏంటి? అతని అలవాట్లు మారే విధానం, అతని కొత్త వ్యవహారశైలి వల్ల స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు పడే ఇబ్బంది ... ఈ సినిమాలో చాలా చక్కగా చూపించినట్టు ట్రైలర్ ను బట్టి అర్ధం అవుతుంది. విభిన్నమైన కథాకథనాలతో నవంబర్ 25వ తేదీన హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది ఈ సినిమా.


సచిన్ - జిగర్ ఈ సినిమాకు సంగీతం అందించగా, దినేష్ విజన్ నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa