అభిమానులకు మహేశ్ బాబు న్యూ ఇయర్ కానుక ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. వివరాల్లోకి వెళ్లితే..మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 25వ సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో అల్లరి నరేశ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
మహర్షి’ మూవీలో మహేశ్ మరో సారి కోటీశ్వరుడి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ మూవీలో మహేష్ బాబు విద్యార్థిగా..ఎన్‌ఆర్ఐగా రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. రీసెంట్‌గా రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన విలేజ్ సెట్స్‌లో రైతు సమస్యలపై కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ షెడ్యూల్ కంప్లీటైంది. ఈ మూవీ నెక్ట్స్ షెడ్యూల్‌ను సంక్రాంతి తర్వాతి ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా ఈ మూవీ యూనిట్ కొత్త సంవత్సర కానుకగా ఈ మూవీలోని రెండో పోస్టర్‌ను ఈరోజు సాయంత్రం 6.03 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ న్యూ ఇయర్‌ని రిషి, అతని ప్రయాణంతో సెలబ్రేట్ చేసుకోండి అంటూ వంశీ ట్వీట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa