cinema | Suryaa Desk | Published :
Wed, Nov 30, 2022, 03:09 PM
రాంచరణ్, ఎన్టీఆర్ ప్రధానపాత్రలో నటించిన RRR సినిమా విడుదలైన దగ్గర నుంచి ప్రభంజనం సృష్టిస్తూనే ఉంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుని ఇప్పటికే పలు అవార్డులను కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ సినిమాకి మరో ఘనత దక్కింది. సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ విజేతగా నిలిచింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ సినిమా మరో 4 అంతర్జాతీయ చిత్రాలతో పోటీపడి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇక రాజమౌళి ఉత్తమ దర్శకుల విభాగంలో రన్నరప్‌గా నిలిచారు. అలాగే బెస్ట్ ఎడిటింగ్ విభాగంలోనూ ఈ చిత్రం రన్నరప్‌గా నిలిచింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com