"లైగర్" సినిమాతో ఉత్తరాది ప్రేక్షకులకు హలో చెప్పారు టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో ఔటండౌట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదలై ఘోర పరాజయాన్ని చవిచూసింది.
తాజా సమాచారం మేరకు, ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఈడీ అధికారుల విచారణలో పాల్గొంటున్నారట. లైగర్ లావాదేవీల విషయంలో కొన్ని అవకతవకలు జరిగాయని అల్లిగేషన్స్ రావడంతో, ఈడీ రంగంలోకి దిగి నిజాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూరీ, ఛార్మీలను విచారించిన ఈడీ లేటెస్ట్ గా విజయ్ ను ప్రశ్నించడం షురూ చేసింది. మరికొన్ని రోజుల్లోనే, లైగర్ వివాదం ఒక కొలిక్కి రాబోతుందని తెలుస్తుంది.