అరుణ్ విజయ్ హీరోగా నటించిన చిత్రం "ఆక్రోశం". "సీనం" టైటిల్ తో తమిళంలో ఆల్రెడీ విడుదలై సూపర్ హిట్టైన ఈ సినిమా తెలుగులో ఆక్రోశం పేరుతో డిసెంబర్ 9వ తేదీన విడుదల కాబోతుంది.
తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ "మాంగళ్య మోక్షితార్ధం" అనే బ్యూటిఫుల్ లవ్ మెలోడీ విడుదలైంది. షాబీర్ స్వరపరిచిన ఈ పాటను అదితి భావరాజు తో కలిసి ఆయనే పాడారు. రాకేందు మౌళి లిరిక్స్ అందించారు.
అరుణ్ విజయ్, పల్లక్ లల్వాని జంటగా నటించిన ఈ సినిమాకు GNR కుమారావేలన్ డైరెక్టర్ గా వ్యవహరించారు. సతీష్ కుమార్, విజయకుమార్ సంయుక్తంగా నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa