సూపర్ స్టార్ రజినీకాంత్ కథ అందించి, సొంతంగా నిర్మించిన "బాబా" మూవీ రీ రిలీజ్ కాబోతుందని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బాబా రీ మాస్టర్డ్ వెర్షన్ లో ఉండబోయే న్యూ సీన్స్ కు రజిని డబ్బింగ్ కూడా పూర్తి చేసారు.
తాజాగా బాబా రీ రిలీజ్ పై మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు డిసెంబర్ 10వ తేదీన బాబా ప్రపంచవ్యాప్తంగా మరోసారి థియేటర్లకు రాబోతుంది. విశేషమేంటంటే డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్ గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ అభిమానులకు బాబా రీ రిలీజ్ కావడం పండగే.
సురేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాను లోటస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రజిని నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ మనీషా కొయిరాలా హీరోయిన్ గా నటించారు. రమ్యకృష్ణ ప్రత్యేక అతిధి పాత్రలో మెరిశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa