గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ "వీరసింహారెడ్డి" సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్మితమవుతున్న ఈ సినిమా తాజాగా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకుంది. ఐతే, ఒక్క పాట షూటింగ్ మాత్రం బ్యాలన్స్ ఉందంట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలానే ఇకపై ముమ్మర ప్రచార కార్యక్రమాలను నిర్వహించి, సినిమాపై మరింత హైప్స్ పెంచేందుకు మేకర్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa