కోమలి ఫేమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'లవ్ టుడే' సినిమా తెలుగు-డబ్బింగ్ వెర్షన్ నవంబర్ 18, 2022న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ సరసన ఇవానా జంటగా నటించారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 13.13 కోట్లు వసూళ్లు చేసింది. సత్యరాజ్, రాధికా శరత్‌కుమార్, యోగి బాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
'లవ్ టుడే' కలెక్షన్స్ ::::
1వ రోజు - 2.22 కోట్లు
2వ రోజు - 2.35 కోట్లు
3వ రోజు - 2.38 కోట్లు
4వ రోజు - 3.54 కోట్లు
5వ రోజు - 98 L
6వ రోజు - 85 L
7వ రోజు - 72 L
8వ రోజు - 58 L
9వ రోజు - 77 L
10వ రోజు - 75 L
11వ రోజు - 38 L
టోటల్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ – 13.13 కోట్లు (6.78 కోట్ల షేర్)