తమిళ సినీపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు శివనారాయణ మూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఆయన మృతికి తమిళ నటీనటులు సంతాపం ప్రకటిస్తున్నారు. శివ నారాయణమూర్తి 200లకు పైగా చిత్రాల్లో నటించారు. ఆయనకు భార్య పుష్పవల్లి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. శివ నారాయణమూర్తి భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలం తమిళనాడు లోని పట్టుకోట్టై జిల్లాలోని ఆయన స్వగృహంలో ఉంచారు.
![]() |
![]() |