అగ్రనటి రష్మికపై కొద్దిరోజులుగా ట్రోల్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక కన్నడ చలన చిత్ర పరిశ్రమ తనని బ్యాన్ చేసిందన్న వార్తలపై నటి రష్మిక తాజాగా స్పందించింది. ఆ వార్తల్ని ఖండిస్తూ తనపై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేసింది. ‘‘కాంతార’ సినిమా విషయంలో నాపై కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆ చిత్రం చూశాక బృందానికి నేను మెసేజ్ పెట్టా. నటీనటుల మధ్య ఏం జరుగుతుందో బయటివారికి తెలియదు. నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను. మెసేజ్‌లు కూడా బయటకు రిలీజ్ చేయలేను. నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పాల్సిన అవసరం లేదు" అని రష్మిక అన్నారు.