మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న కొత్త చిత్రం "వాల్తేరు వీరయ్య". ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న మాస్ రాజా రవితేజ ఇంట్రో గ్లిమ్స్ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విడుదవ్వగా, మూడు గంటల్లోనే వన్ మిలియన్ రియల్ టైం వ్యూస్ సాధించి ఆడియన్స్ లో ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ను మరొకసారి రుజువుచేసింది. రవితేజ యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ... వెరసి ఈ ఇంట్రో టీజర్ అదరగొట్టేసింది.
కే ఎస్ రవీంద్ర డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa