దర్శకుడు కొరటాల శివ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమా పట్టాలెక్కబోతున్న విషయం తెలిసిందే. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తోన్న రెండో చిత్రమిది. అయితే, ఇంకా సెట్స్ పైకి వెళ్లని ఈ మూవీ గురించి ఆసక్తికర వార్తలు బయటకొస్తున్నాయి. తాజాగా, ఈ చిత్రంలో ఎన్టీఆర్.. ఆరు వేళ్లున్న చేతితో కనిపించబోతున్నారట. ఆ ఎక్స్ ట్రా ఫింగర్ ఆయన క్యారెక్టర్ ను ఎలివేట్ చేసేలా డిజైన్ చేశారని సమాచారం. ఆయనకు కోపం వచ్చిన ప్రతిసారీ ఆరో వేలు బిగుసుకుపోవడం ఓ సింబాలిక్ గా నిలుస్తుందట. ఇక కథలో కొంత మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.