ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చెయ్యడానికి రెడీ అవుతున్న సినిమాలలో హీరో నిఖిల్ సిద్ధార్ధ హీరోగా నటించిన "18పేజెస్" ఒకటి. పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో డిఫరెంట్ అండ్ క్రేజీ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ గారు ఈ సినిమాకు కథను అందించారు. అంతేకాక గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ తో కలిసి ఈ సినిమాను నిర్మించారు కూడా.
18 పేజెస్ ట్రైలర్ ను అల్లు అరవింద్ గారు, డైరెక్టర్ సుకుమార్ గారు విడుదల చెయ్యగా, ఇప్పుడు 18 పేజెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రంగంలోకి దిగబోతున్నారు. ఈ రోజు సాయంత్రం ఆరింటి నుండి హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ లో జరగబోయే 18 పేజెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరై సినిమాకు తగినంత హైప్ తీసుకురానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa