ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడివిశేష్ రిలీజ్ చెయ్యనున్న 'కొరమీను' ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 20, 2022, 08:50 PM

శ్రీపతి కర్రి డైరెక్షన్లో ఆనంద్ రవి, కిషోరీ ధాత్రిక్ జంటగా నటిస్తున్న చిత్రం "కొరమీను". ఈ సినిమాను ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పెళ్లకూరు సామాన్య రెడ్డి నిర్మిస్తున్నారు. మాంగో మాస్ మీడియా సమర్పిస్తుంది. రాజా రవీంద్ర, జబర్దస్త్ ఇమ్మానుయేల్, శత్రు, హరీష్ ఉత్తమన్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కాబోతుంది.


విడుదల తేది దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు రేపు సాయంత్రం నాలుగు గంటలకు కొరమీను ట్రైలర్ విడుదల కాబోతుందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. పోతే, ఈ ట్రైలర్ ను హిట్ మెషీన్ అడివిశేష్ లాంచ్ చెయ్యనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa