'కలర్ ఫోటో' మూవీతో హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రాజ్ ఇప్పుడు "ముఖచిత్రం" అనే సినిమాతో స్టోరీ రైటర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గంగాధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 9న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 0.47 కోట్లు వసూళ్లు చేసింది. యంగ్ హీరో విశ్వక్ సేన్, చైతన్య రావు మాదాడి, వికాస్ వశిష్ట, అయేషా ఖాన్,ప్రియా వడ్లమాని ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాకెట్ మనీ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమాకి కాలభైరవ సంగీతం అందించారు.
'ముఖచిత్రం' సినిమా కలెక్షన్స్ ::::::
నైజాం : 0.16 కోట్లు
సీడెడ్ : 0.13 కోట్లు
ఆంధ్రాప్రదేశ్ : 0.18 కోట్లు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.46 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ : 0.01 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 0.47 కోట్లు