ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరు ఐకానిక్ స్టిల్ రీ క్రియేట్ చేసిన "వాల్తేరు వీరయ్య"

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 24, 2022, 07:44 PM

కొంతసేపటి క్రితమే "వాల్తేరు వీరయ్య" సినిమా నుండి థర్డ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అప్డేట్ పోస్టర్ వచ్చింది. ఈ పోస్టర్ ను పరిశీలిస్తే.. ఇందులో చిరు గ్యాస్ బర్నర్ ను చేత్తో పట్టుకుని కనిపిస్తారు. ఈ స్టిల్ మెగాస్టార్ ఐకానిక్ మూవీ గ్యాంగ్ లీడర్ సినిమా లోనిది. వాల్తేరు వీరయ్య థర్డ్ సింగిల్ వీరయ్య టైటిల్ సాంగ్ ఎనౌన్స్మెంట్ కోసం మేకర్స్ గ్యాంగ్ లీడర్ ను వాడుకోవడంతో ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.


బాబీ డైరెక్షన్లో ఔటండౌట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీరోల్ లో నటిస్తున్నారు. శ్రుతిహాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa