తెలంగాణ ముఖ్యమంత్రి గౌ..కె.చంద్రశేఖరావుగారి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావుని కాంతారావు బయోపిక్ రాజకుమారుడి చిత్ర దర్శకుడు పి.సి. ఆదిత్య ఈ రోజు కలసి చిత్ర విశేషాలను వివరించారు. ఎన్టీఆర్, ఎఎన్ఆర్‌లతో సమానంగా వెలిగి, జీవిత చివరి దశలో కష్టాలు పడ్డ కత్తివీరుడి కాంతారావు జీవిత విశేషాలతో రూపొందిస్తున్న రాజకుమారుడి చిత్ర నిర్మాణానికి సహకరించగలందులను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీ జ్వాలా నరసింహారావు స్పందిస్తూ తెలంగాణ హీరో కాంతారావు బయోపిక్ రూపొందించడం అభినందనీయమని ఈ విషయాలను ముఖ్యమంత్రి కెసిఆర్‌గారి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. రాజకుమారుడి పోస్టర్‌ను వనం ఆవిష్కరించి దర్శకులు ఆదిత్యకు అందజేశారు. ఈ సందర్భంగా రాజకుమారి-2019 క్యాలెండర్‌ను దర్శకుడడు ఆదిత్య వనం వారికి బహుకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa