ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత - నాగ చైతన్య చిత్రం ఫై తాజా వార్త

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 13, 2019, 02:49 PM

నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య , సమంత జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రం నుండి సెకండ్ లుక్ ను విడుదలచేయనున్నారు. సంక్రాంతి కానుకగా రేపు ఉదయం 11:52నిమిషాలకు ఈ లుక్ విడుదలకానుంది.


రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా నటి దివ్యంశ కౌశిక్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈచిత్రం ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలకానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa