ట్రెండింగ్
Epaper    English    தமிழ்

F2 సినిమా: బ్లాక్ బస్టర్ 12 డేస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 24, 2019, 06:13 PM

సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ - మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'F2' జనవరి 12 న విడుదలైంది.  సంక్రాంతి సీజన్లో చివరగా రిలీజ్ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి కలెక్షన్స్ వసూలు చేసింది.  పండగ సీజన్లో ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ ఉండడం.. పైగా పోటీలో ఉన్న ఇతర సినిమాలకు పెద్దగా ఆదరణ దక్కకపోవడం తో వెంకీ - వరుణ్ సినిమాకు అడ్డులేకుండా పోయింది.

రిలీజ్ అయిన పన్నెండు రోజులకుగాను తెలుగు రాష్ట్రాలలో 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించింది.   ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫీట్ సాధించిన సినిమాలలో ఇది 18 వ సినిమా.  ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ వ్యాల్యూ రూ. 34.50  కోట్లు మాత్రమే. పెట్టుబడితో చూసుకుంటే ఇప్పటికే ఈ సినిమా రైట్స్ తీసుకున్న బయ్యర్లందరికి జాక్ పాట్ తగిలినట్టే.

తెలుగు రాష్ట్రాల్లో F2 ఏరియావైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.


నైజామ్: 17.30  cr
సీడెడ్: 6.53 cr
ఉత్తరాంధ్ర: 7.70 cr
కృష్ణ: 4.16 cr
గుంటూరు: 4.25 cr
ఈస్ట్ : 5.76 cr
వెస్ట్: 3.29 cr
నెల్లూరు: 1.52 cr

టోటల్: రూ. 50.48 cr






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa