త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ "ధమాకా" సినిమా డిసెంబర్ 23, 2022న తెలుగు మరియు హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. థియేటర్ల రన్ లో మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం యొక్క హిందీ వెర్షన్ ప్రస్తుతం ZEE5లో ప్రసారం అవుతోంది. బిగ్ ధమాకా అనే టైటిల్ తో ఈ సినిమా తెలుగు వెర్షన్ తో పాటు హిందీ వెర్షన్ కూడా థియేటర్లలో విడుదలైంది. ఒరిజినల్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుండగా, హిందీ డబ్బింగ్ వెర్షన్ ZEE5లో అందుబాటులో ఉంది.
ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, జయరామ్, రావు రమేష్, చిరాగ్ జానీ, అలీ, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.