కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను జనవరి మొదటి వారంలో ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్-సైఫ్ అలీఖాన్ కాంబినేషన్లో రెండు భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ కి పీటర్ హెయిన్ సన్నివేశాలను రూపొందించారు. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా కొత్తగా సర్ ప్రైజింగ్ గా ఉన్నాయని ప్రతి ఫైట్ క్లైమాక్స్ లా ఫీల్ ఇస్తుందని లేటెస్ట్ టాక్.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, తారక్ పొన్నప్ప కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.