కన్నడ బ్యూటీ రష్మిక మందన .. మలయాళీ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ గురించే ఇదంతా. ఆ ఇద్దరూ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాల్లో నటిస్తున్నారు. సాయిధరమ్ సరసన `చిత్రలహరి`లో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయిక. దేవరకొండ సరసన `డియర్ కామ్రేడ్` లో నటిస్తోంది రష్మిక మందన. ఆ రెండు సినిమాల్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఆసక్తికరంగా ఇద్దరు హీరోయిన్స్ బర్త్ డే ఒకేరోజు కావడంతో మైత్రి సంస్థ లో ఎమోషనల్ మూవ్ మెంట్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ ఇద్దరికి హ్యాపి బర్త్ డే అంటూ అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆ ఇద్దరి బర్త్ డే ఒకేరోజు కావడం యాథృచ్ఛికం. ఆ ఇద్దరూ కలిసి స్నేహంగా ఉన్న ఫోటో అంతర్జాలంలో వైరల్ అవుతోంది. నేటి బర్త్ డే బేబీస్ కెరీర్ టాలీవుడ్ లో పెద్ద ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తూ.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa