ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ 'అర్జున్ రెడ్డి' ట్రైలర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2019, 03:03 PM

తెలుగులో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా సత్తాను ఈ సినిమా చాటి చెప్పింది. ఇదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' టైటిల్ తో .. షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి రూపొందిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమాలో, కథానాయికగా కైరా అద్వాని నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. దర్శకుడు సందీప్ రెడ్డి .. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా, మరికొంత డోస్ పెంచినట్టు ఈ టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. కైరా అద్వాని మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. జూన్ 21వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. హిందీలోనూ ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa