ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హౌస్ ఫుల్ రన్ తో నైజాంలో హవా కొనసాగిస్తున్న 'మజిలీ'

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2019, 04:09 PM

యువ సామ్రాట్ నాగ చైతన్య , సమంత జంటగా నటించిన తాజా చిత్రం మజిలీ ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లను రాబడుతుంది. ముఖ్యంగా ఈ చిత్రం నైజాం లోని చాలా ఏరియాల్లో హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది. శనివారం ఈ చిత్రం నైజాం లో 1.81కోట్ల షేర్ ను రాబట్టగా నిన్న 1.59 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. దాంతో కేవలం మూడు రోజుల్లో ఈ చిత్రం నైజాం లో 5.34 కోట్ల షేర్ ను రాబట్టింది.

కాగా ఈ చిత్రం అక్కడ 6కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా రేపటి తో బ్రేక్ ఈవెన్ కు చేరుకోనుంది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa