నటి నయనతార-విఘ్నేశ్ శివన్ జోడీ రొమాంటిక్ వెకేషన్ లో ఉన్నారు. గ్రీస్ దేశంలో ప్రస్తుతంవారి ప్రేమ యాత్ర కొనసాగుతోంది. ఈ విషయాన్ని నయనతార స్వయంగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకొని మరీ వెల్లడించింది. గ్రీస్ దేశంలో ఎథెన్స్ నుండి సాంటోరిని కి వెళ్తున్నామని చెప్తూ ఫ్లైట్ టికెట్స్ ఫోటో పెట్టింది. ఇందులో నయన్.. విఘ్నేశ్ ఇద్దరి టికెట్స్ ఉన్నాయి. ఇద్దరి టికెట్స్ కు మధ్య ఒక లవ్ సింబల్ కూడా పెట్టింది. అదే కాకుండా తన సింగిల్ ఫోటోలను కూడా కొన్నిటిని షేర్ చేసింది. ఒక ఫోటోలో నయన్ వైట్ డ్రెస్ లో ఒక గ్లాస్ డోర్ ముందు నిలబడగా ఉండగా విఘ్నేశ్ ఫోటో తీస్తునట్టుగా గ్లాస్ డోర్ పై విఘ్నేశ్ ప్రతిబింబం కనిపిస్తోంది. ఈ ఫోటోలోనే నయన్ ఎడమ చేతిపై ‘పాజిటివిటి’ అనే పచ్చబొట్టు కూడా ఉంది.
Greek beauty #Nayanthara pic.twitter.com/JXc5tBK71o
— Deepika Thara (@TharaDeepika) June 10, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa