నెటిజన్లతో పెట్టుకుంటే ఎంత పెద్ద సెలబ్రిటీలకైనా దిమ్మదిరిపోవడం ఖాయం. ప్రముఖుల పోస్టులు, ట్వీట్స్ నిత్యం ఫాలో అయ్యే నెటిజన్లు వాటిలో దొరికే తప్పులను ఎత్తిచూపుతుంటారు. బాగుంటే ప్రశంసలు కురిపిస్తారు. అందుకే ఆచితూచి పోస్టులు, ట్వీట్స్ చేయడం మంచిది. కొద్దిరోజుల క్రితం వ్యతిరేకించిన అంశాన్ని, తర్వాత సమర్థిస్తూ ట్వీట్స్ చేస్తే నెటిజన్లు ఊరుకోకుండా ట్రోల్స్ చేస్తుంటారు. తాజాగా గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయికి ఇలాంటి అనుభవమే ఎదురైంది.
మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా ఉన్నా చిన్మయి, తనకు జరిగిన అన్యాయాలను కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇటీవల… సినిమాల్లో హీరో హీరోయిన్ల వయసు తేడాపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘వయసు పైబడిన హీరోలు యంగ్ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయడం ఫిలిం ఇండస్ట్రీలో సాధారణమే. ఇది ఇంకా కొనసాగుతోంది. ఎప్పుడు ఆగుతుందో చూడాలి’ అని విమర్శించింది. దీనికి నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
తర్వాత సీన్స్ రివర్స్ అయ్యింది. చిన్మయికి రెండు నాలుకలు ఉన్నాయంటూ తిట్టిపోస్తున్నారు.. చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ‘మన్మథుడు 2’ సినిమాలో 60 ఏళ్ల హీరో అక్కినేని నాగార్జునతో యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ చిన్మయి బాగానే చేస్తోంది. అయితే చిన్మయి చేసిన కామెంట్‌ను నెటిజన్లు ఎత్తిచూపుతున్నారు. ‘హీరో హీరోయిన్ల వయసుపై కామెంట్ చేశావు కదా. మరి ఇప్పుడు నీ భర్తనే ఇలాంటి కాంబినేషన్ ప్రోత్సహిస్తున్నాడు. ఆ సినిమాకు నువ్వే ప్రమోషన్స్ చేస్తున్నావు. తండ్రి వయసులో ఉన్న నాగార్జున, కూతరి వయసున్న భామలకు ముద్దులు పెడుతూ, రొమాన్స్ చేస్తున్నాడు. దీన్నేమంటావ్’ అంటూ చిన్మయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నకు దిమ్మదిరిగిపోయిన చిన్మయికి ఏం సమాధానం చెప్పాలో తెలీక సైలెంట్ అయిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa